అల్లూరి సీతారామరాజులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం - MicTv.in - Telugu News
mictv telugu

అల్లూరి సీతారామరాజులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

June 13, 2022

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగి, ఐదుగురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద సంగీత ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ముగ్గురు, భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురు భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లంతా ఒడిశాలోని చిన్న పల్లి నుంచి విజయవాడకు వెళ్తుండగా, బస్సు ప్రమాదానికి గురైంది. మృతుల్లో ధనేశ్వర్ దళపతి (24), జీతు హరిజన్ (5), సునేనా హరిజన్ (2)తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. మృతి చెందిన వారందరు ఒడిశా వాసులుగా గుర్తించాం..కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం.” అని వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. పని ముగించుకొని తిరిగి పయాణంలో మృత్యువు వారిని వరించింది.