చిత్తూరులో ఘోరం.. వాహనాలపైకి కంటైనర్, 12 మంది బలి  - MicTv.in - Telugu News
mictv telugu

చిత్తూరులో ఘోరం.. వాహనాలపైకి కంటైనర్, 12 మంది బలి 

November 8, 2019

Road accident.

చిత్తూరు జిల్లాలో ఓ కంటైనర్ మృత్యువాహనంలా మారింది. బంగారుపాళ్యం మండలం చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్ వద్ద బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి పక్కనే వెళ్తున్న వాహనాలపై పడిపోయింది. ఓ ఆటో, ఓ ఓమ్నీ వ్యాన్, ఒక మోటార్ సైకిల్ దానికింద పడి నుజ్జయ్యాయి. ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కంటైనర్ డ్రైవర్ కూడా ఉన్నాడు. క్షతగాత్రులను పలమనేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు.