road accident in Mexico video viral on social media
mictv telugu

జాగ్రత్త.. మీకూ ఇలాగే జరగొచ్చు.. వైరల్ వీడియో

July 7, 2022

ఈ వర్షాకాలంలో బయటకు వెళ్లినప్పుడు బైక్‌లు, కార్‌లు కానీ ఎక్కువ స్పీడ్‌తో నడిపితే రోడ్ మీద స్కిడ్ అయి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అందునా ఏటవాలుగా ఉన్న రోడ్ల మీద డ్రైవింగ్ అంటే కాస్త అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే. లేదంటే ప్రమాదం తప్పదు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి నెటిజన్లకు ఆందోళనకు గురిచేస్తోంది. వీడియోలో ఏటవాలుగా ఉన్న రహదారిలో వాహనాలన్నీ యాక్సిడెంట్ అవుతుండటం, అసలు ఏం జరుగుతోందో, ఎలా జరుగుతుందో అర్ధంకావడం లేదంటూ పేర్కొంటున్నారు. అందుకే ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. వీడియోలో రోడ్డుపై కనిపించిన వాహనాలన్నీ జారిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది.

ఒక కారు అకస్మాత్తుగా రోడ్డుపై జారి.. పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టగా, మరో కారు వెనుక నుంచి ఒకదాని తర్వాత ఒకటి రెండు వాహనాలు వచ్చి దానిని ఢీకొంటాయి. ఇలాంటి ఘటనలు మరికొన్ని కెమెరాకు చిక్కాయి. ఈ వీడియోలో ఓ బైక్ కూడా రోడ్డుపై జారిపోవడం కనిపించింది. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ రహదారి మెక్సికో సిటీ, కొలోనియా లా కెనడాలో ఉందని అంటున్నారు. ఈ రహదారి హైడ్రాలిక్ కాంక్రీట్‌తో తయారు చేయడం వల్ల వర్షాకాలంలో జారేలా చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ వీడియో చాలామందిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 4 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి.