తెలంగాణలో ఘోర ప్రమాదం..నలుగురు బలి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఘోర ప్రమాదం..నలుగురు బలి

July 16, 2020

Road accident in telangana

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలం చీకటాయపాలెం సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. 

మరో ఏడుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని  గోవిందు, రాట్ల ధూర్యా, హరియా, మధుగా గుర్తించారు. వారంతా రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆంబోతు తండాకు చెందినవారిగా గుర్తించారు. ఆ పదకొండు మంది కూలీలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో తుమ్మకర్రలను కొనుగోలు చేశారు. లారీలో వాటిని రంగారెడ్డికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తొర్రూర్ మండలంలో తరచూ తుమ్మచెట్లు, తుమ్మకర్రలను అక్రమంగా తరలిస్తుంటారని స్థానిక అధికారులు తెలిపారు.