రోడ్డుపై రక్తగాయాలతో.. చూస్తూ వెళ్లిన మానవులు! - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డుపై రక్తగాయాలతో.. చూస్తూ వెళ్లిన మానవులు!

March 28, 2018

రోబోలు మనుషులకు సేవలు చేస్తున్న ఆధునిక కాలంలో జీవిస్తున్నాం. అయితే మరోపక్క ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. ఆపదలో ఉన్న సాటిమనిషిని జనం పట్టించుకోకుండా చోద్యం చూసినట్లు చూసుకుంటూ వెళ్లిపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెత్తురోడుతున్న మహిళను అదే రోడ్డుపై కార్లు, జీపులు, బైకుల్లో వెళ్తున్న జనం ఏమాత్రం పట్టించుకోకుండా తమ తమ రాచకార్యాల కోసం వెళ్లిపోయారు. ఈ వీడియో మానవత్వాన్ని ప్రశ్నిస్తూ, తలదించుకునేలా చేస్తోంది.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని కడ్కావూర్‌లో ఈ దారుణం జరిగింది. 65 ఏళ్ల మహిళను ఏ బైకర్ ఢీకొట్టి పారిపోయాడు. ఆమె గాయాలతో రోడ్డుపై పడిపోయింది. చాలాసేపటి వరకు ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. చాలామంది చూస్తూ వెళ్లిపోయారు. తర్వాత ఓ యువకుడు సాయం చేయడానికి వచ్చాడు. మరికొందరు అక్కడికి చేరారు. ఇంతలో ఏదో నేరం జరిందని పోలీసుల వాహనం హడావుడిగా అక్కడికొచ్చింది. తమకు విషయం తెలియదని అందుకే ఆలస్యంగా వచ్చామని చెప్పారు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించి, నిందితుణ్ని అరెస్ట్ చేశారు.