వరంగల్‌లో ఘోరం... ముగ్గురు యువకులు బలి - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్‌లో ఘోరం… ముగ్గురు యువకులు బలి

April 24, 2019

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు రక్తం స్రవిస్తూనే ఉన్నాయి. అధిక వేగం, నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తున్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు.  ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులో వేగంగా వస్తున్న బైక్‌ చెట్టును ఢీ కొట్టింది.

Road accident kills three people in Warangal urban district as their motor bike hits tree.

బైక్‌పై ముగ్గురు యువకులు వర్ధన్నపేట నుంచి వరంగల్‌ వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులను వర్ధన్నపేట మండలానికి చెందిన గొడిశాల రామ్‌సాయి(20), మామిండ్ల ఆదిత్య(20), మురళిగా గుర్తించారు. రామ్‌సాయి, ఆదిత్య అక్కడికక్కడే చనిపోగా, మురళీ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.