Road Accident reveals rare tortoise illegal transportation In AP
mictv telugu

యాక్సిడెంట్ ఆటోలో కదులుతున్న మూటలు.. ఓపెన్ చూసి చూడగా..

August 26, 2022

ఏపీలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. తాబేళ్ల అక్రమ రవాణాను బయటపెట్టింది. కాట్రేనికోన మండలం చెయ్యారు అగ్రహారం వద్ద అమలాపురం వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలు కాగా వారిని 108 సాయంతో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన చోట ఓ తాబేలు కూడా చనిపోయి పడి ఉంది. రోడ్డు దాడుతూ వాహనాల టైర్ల కింద అది పడిందేమో అని తొలుత అనుకున్నారు.

కానీ యాక్సిడెంట్‌కు గురైన ఆటోలో ఉన్న కొన్ని మూటలు కదలడాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి ఆ మూటలను విప్పగా లోపల 15 తాబేళ్లు ఉన్నాయి. అప్పుడు వారికి అసలు విషయం అర్ధమైంది. ఆటోలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు తాబేళ్లను అక్రమ రవాణా చేస్తున్నారని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు.