'కచ్చా బాదామ్' సింగర్‌కు రోడ్డు ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

‘కచ్చా బాదామ్’ సింగర్‌కు రోడ్డు ప్రమాదం

March 1, 2022

02

‘కచ్చా బాదామ్‌’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిన ‘భూబన్‌ బద్యాకర్‌’‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం స్వయంగా తానే కారును నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఛాతీలో బలమైన గాయం కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం భూబన్‌ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

‘కచ్చా బాదామ్‌’పాట భూబన్‌ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే. భూబన్‌ స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్‌ కురల్జురీ గ్రామం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్‌.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ, వాటిని జంక్‌ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200,300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు.

మరోపక్క భూబన్ పాటను విన్న పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌ యాజమాన్యాలు అతని చేత పాట పాడించి సామాజిక మాధ్యమాలలో విడుదల చేశారు. దీంతో తెగ వైరల్ అయ్యాడు. మొదట్లో సాంగ్‌ వైరల్‌ అయినప్పుడు తనకు క్రెడిట్‌ దక్కలేదని గోల చేసిన భూబన్‌, తీరా అది దక్కాక పూర్తిగా మారిపోయాడు.