లాక్‌డౌన్ పుణ్యం!  రోడ్డు ప్రమాదాలు ఎంత భారీగా తగ్గాయంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ పుణ్యం!  రోడ్డు ప్రమాదాలు ఎంత భారీగా తగ్గాయంటే..

September 18, 2020

Road accidents decreased in lock down

కరోనా వైరస్ వ్యాప్తిని నిర్ములించడానికి కేంద్ర ప్రభుత్వం 68 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. అత్యవసర వాహనాలు మినహా వేరే వాహనాలు రోడ్లపైకి రాలేదు. లాక్‌డౌన్ అయిపోయినప్పటికీ పెద్దగా ప్రజలు రోడ్లపైకి రావడం లేదు. అవసరం ఉంటేనే బయటికి వస్తున్నారు. విద్య సంస్థలు ఇంకా ప్రారంభం కాకపోవడం మరొక కారణం. దీంతో దేశవ్యాప్తంగా గడచిన ఆరేళ్లలో కంటే 35 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. 

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెల వరకు 1,60,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయని కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన లెక్కల్లో తెలిపింది. 2014 నుంచి 2019 వరకు 2,48,000 రోడ్డుప్రమాదాలు జరగ్గా, ఈ ఏడాది తగ్గాయని కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఢిల్లీ, కర్ణాటకలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 45 శాతానికి పైగా తగ్గింది.