శ్రీవారి భూముల అమ్మకానికి రోడ్ మ్యాప్ వేయమన్నాం, అంతే..సుబ్బారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవారి భూముల అమ్మకానికి రోడ్ మ్యాప్ వేయమన్నాం, అంతే..సుబ్బారెడ్డి

May 25, 2020

yv subba reddy.

తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆస్తులను వేలం వేయాలని  పాలక మండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీటీడీ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ..’టీటీడీ భూముల అమ్మకం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయంతీసుకొలేదు. రోడ్ మ్యాప్ మాత్రమే రెడీ చేయమన్నాం. దీనికే ఇంత రాద్ధాంతమా? తిరుమల వెంకన్నకు రాజకీయాలు ఆపాదించొద్దు. తమిళనాడులో అన్యాక్రంతం అయ్యే అవకాశం ఉన్న భూములను గుర్తించాం. ఇవి సెంటు నుంచి ఐదుసెంట్ల వరకు ఉంటాయి. వీటిని కాపాడటమూ కష్టమే. అందుకే వీటిని విక్రయించడానికి గల అవకాశాలు పరిశీలించాలని గత బోర్డు సమావేశంలో చర్చించాం. వేలంపాట వేయడానికి ఉన్నఅవకాశాలపై ప్రతిపాదనలు రెడీ చేయాలని మాత్రమే నిర్ణయంతీసుకున్నాం. స్వామివారికి భక్తులు ఇచ్చిన భూములను కాపాడాలన్నదే మా తాపత్రయం. ఒకవేళ, దోచుకోవాలన్న ఆలోచన ఉంటే.. టీటీడీ భూములనే అమ్మాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు సదావర్తి భూములు, కనకదుర్గమ్మ భూములు కొట్టేయాలని చూశారు. ప్రతిపక్షంగా, ఆనాడు టీటీడీ నిధులను కాపాడటానికి ప్రయత్నించం. టీటీడీలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడం కొత్త కాదు’ అని అన్నారు.