మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్‌కి ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్‌కి ప్రమాదం

February 17, 2020

ggsd c

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

 బంజారాహిల్స్ వెంగల్ రావు పార్క్ వద్ద బైక్‌ను తప్పించబోయి కాన్వాయ్‌లోని వాహనాలు ఒక్కదాన్ని మరొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మరో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. కాన్వాయ్‌లోని వాహనాలు తక్కువ వేగంతోనే వెళ్తుండటంతో ఎవ్వరికీ గాయాలు కాలేదు. తరువాత మంత్రి వేరే వాహనంలో ప్రగతి భవన్ వెళ్లారు.