ఓ మహిళ ఏటీఎంలో భారీ మొత్తంలో డబ్బులు డ్రా చేసింది. ఆమెనే ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన ఓ దొంగోడు తళతళలాడుతున్న కరెన్సీ కట్టలను ఆశగా చూశాడు. కానీ దోచుకునేందుకు అవకాశం లేకపోయింది. కెమెరాలు, ఏటీఎం బయట జనం, అక్కడక్కడా పోలీసులు కూడా ఉన్నారు. దుస్సాహసానికి తెగబడితే నేరుగా జైలే గతి. అందుకే జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లాడు. ఎవరూ లేని చోట, చుట్టుపక్కల పరిస్థితిని పక్కగా గమనించి దోచుకోవాలనున్నాడు.
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 37 కిలోమీటర్ల దూరం ఆమెను అనుసరించాడు.అవకాశం కలిసొచ్చింది. అలాంటి అనుకూలమైన చోటు కనిపించింది. అంతే, ఒక్కసారిగా ఆమె మీద పడి దాడి చేశాడు. కింద పడేసి డబ్బు లాక్కున్నాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించింది. అయినా అతని పశుబలం ముందు ఫలితం లేకపోయింది. దొంగోడు నోట్ల కట్టలు గుంజుకుని పారిపోయాడు. సినీఫక్కీలో జరిగిన ఈ దారుణ వీడియోలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో గత నెల ఈ ఘోరం జరిగిది.
వియత్నాంకు చెందిన నుహుంగ్ త్రూంగ్ అనే 44 మహిళ తను దేశానికి వెళ్లడానికి బ్లాక్ హాక్ బొలేవర్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏటీఎం నుంచి 4300 డాలర్లు(రూ. 3.5 లక్షలు) డ్రా చేసుకుంది. తర్వాత షాపింగ్ చేయడానికి వెళ్లింది. ఆమె డబ్బును డ్రా చేసుకోవడం చూసిన దొంగ ఫాలో అయ్యాడు. ఆమె బెలారీ ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్ చేరుకుంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దొంగ త్రూంగ్‌పై దాడి చేసి డబ్బు లాక్కున్నాడు. దాడిలో త్రూంగ్ వెన్నెముక విరిగిపోయింది.
అటుగా వచ్చిన స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు ఆమె ఆస్పత్రిలో చేరారు. వెన్నెముక విరిగిపోయిందని, ఆ గాంతో జీవితాంతం బాధపడాల్సిన ఉంటుందని వైద్యుల చెప్పారు. దొంగను పట్టుకోవడానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దాడి వీడియోలను విడుదల చేసి, అతని ఆచూకీ చెప్పాలని ప్రజలను కోరుతున్నారు.