హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దుండగులు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దుండగులు

April 25, 2019

హైదరాబాద్‌లో కొందరు దుండగులు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు. మహాత్మాగాంధీ బస్సు స్టాండ్ దగ్గరున్న గౌలిగూడ బస్టాప్‌లో మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక ఆర్టీసీ డ్రైవర్ నైట్‌హాల్ట్‌ కోసం బస్సును నిలిపాడు. ఆ బస్సు మాయం అయిపోయింది. ఎవరు ఎత్తుకెళ్లారు.. ఏం చేస్తున్నారనే సమాచారం అటు ఆర్టీసీ అధికారులకు, ఇటు పోలీసులకు తెలియడం లేదు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్‌ ప్రాంతంలో ఒక ఆర్టీసీ సిటీ బస్సు తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దాదాపు 24 గంటలు కావస్తున్నా కుషాయిగూడ డిపోకు చెందిన బస్సు ఆచూకీని తెలుసుకోలేకపోయారు.

Robbers rob rtc city bus in hyderabad