హైదరాబాద్‌లో కాల్పులు.. 5 కేజీల బంగారం దోపిడీ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో కాల్పులు.. 5 కేజీల బంగారం దోపిడీ

March 6, 2018

హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో భారీ దోపిడీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ నగల వ్యాపారి ఇంట్లోకి  చొరబడి, కాల్పులు జరిపి, 5 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. మంగళవారం మిట్టమధ్యాహ్నం ఈ దోపిడీ జరిగింది. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వుడు హెడ్ క్వార్టర్స్ కార్యాలయం వెనక ఉన్న బంగారు నగల తయారీ కేంద్రంలోకి దుండగులు చొరబడ్డారు.

దిమందికిపైగా మోటారు బైకులు, కారులో అక్కడికొచ్చారు. కార్మికులను తుపాకులతో బెదిరించి, గాలిలోకి కాల్పులు జరిపి భయపెట్టారు. తర్వాత తయారీలో ఉన్న 5 కిలోల బంగారు నగలు తీసుకుని పారిపోయారు. రెండు బైకులను అక్కడే వదలిలేసి పోయారు.

దోపిడీదొంగలు హిందీ మాట్లాడారని, హైదరాబాద్‌ వాసులు కారని బాధితులు చెబుతున్నారు. వారు పక్కా పథకం ప్రకారమే దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. అక్కడి సీసీ కెమెరాల వెర్లు కత్తిరించి ఉన్నాయి. పోలీసులు వారిని పట్టుకోవడానికి నాకాబంది చేస్తున్నారు.