కొమురవెల్లి మల్లన్నకు శఠగోపం.. 3 తులాల బంగారం హుష్ - MicTv.in - Telugu News
mictv telugu

కొమురవెల్లి మల్లన్నకు శఠగోపం.. 3 తులాల బంగారం హుష్

May 17, 2019

Robbery in komuravelli mallikarjuna swamy temple.

తెలంగాణలో దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మానుష్యంగా ఉండే ఆలయాలనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆలయాల్లో బయటి దొంగల తాకిడి తట్టుకోలేక పోతుంటే. వారికి తోడుగా కొత్తగా ఇంటి దొంగలు తయారయ్యారు. ఇటీవల బాసర సరస్వతి ఆయలంలోని అమ్మవారి వజ్రం అదృశ్యమైన సంగతి తెలిసిందే. తాజాగా సిద్దిపేట సమీపంలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం హుండీ లెక్కింపుల్లో బంగారం నాణ్యత పరిశీలించే స్వర్ణకారులు చేతివాటం ప్రదర్శించారు.

ఆ ఆలయంలో సాధారణంగా నగదు కానుకలను ఆలయ ఉద్యోగులతో పాటు సేవా సమితి సభ్యులు లెక్కిస్తుంటారు. బంగారు కానుకల విషయానికి వచ్చేసరికి వాటి నాణ్యతను పరిశీలించడానికి స్థానికులైన స్వర్ణకారులకు పని అప్పగిస్తారు. అదే అదనుగా చేసుకొని బూర్గుల శ్రీనివాసచారి, బూర్గుల కిషన్‌ చారి దాదాపు 20గ్రాముల బంగారు నెక్లెస్‌ను మాయం చేసి తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో వేసుకున్నారు. అలాగే మరో 10 గ్రాముల బంగారు ఆభరణాలను చొక్కా జేబుల్లో వేసుకున్నారు. అయితే వారు బయటకు వెళ్లే సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తనిఖీ చేయగా విషయం బయటపడింది. ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.