మనుషులు చేసే పనులన్నీ రోబో కూడా చేస్తుంది కదా.. దానికి పౌరసత్వం ఇస్తే తప్పేమిటని అనుకుందో ఏమో సౌదీ అరేబియా ప్రభుత్వం సోఫియా అనే హ్యూమనాయిడ్ రోబోకు పౌరసత్వం ఇచ్చింది.
దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ రోబోకు పౌరసత్వం లభించినట్టయింది. ఇటీవల రియాద్ లో జరిగిన కార్యక్రమంలో దీనికి అధికారికంగా పౌరసత్వం ప్రదానం చేశారు. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ సంస్థ ఈ రోబోను తయారు చేసింది. చేసింది. దీనిపై సోఫియా హర్షం వ్యక్తం చేసింది. అయితే మహిళలపై కఠిన ఆంక్షలున్న సౌదీలో ఈ ఆడ రోబోపై కాస్త కనికరం చూపించారు.ప్రదర్శనలో దీనికి బురఖా వేయలేదు. ధనిక దేశమైన సౌదీలో చాలా పనులకు రోబోలను వాడతారు.