Robot Is Appointed As CEO Of A $10 Billion Chinese Metaverse Company
mictv telugu

మిస్ టాంగ్ యూ.. మొట్టమొదటి రోబో సీఈవో..

September 12, 2022

రోబోటిక్‌ సేవలలో చైనా మెటావర్స్‌ కంపెనీ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రోబోలు వర్కర్లుగా, ఉద్యోగులుగా మాత్రమే సేవలందిస్తున్నాయని తెలుసు. కానీ, ఇప్పుడు ఏకంగా రోబో ఒక కంపెనీకి సీఈవోగా మారింది . మిస్ టాంగ్ యు అనే వర్చువల్ హ్యూమనాయిడ్ రోబోను ‘ఫ్యుజియన్ నెట్ డ్రాగన్ వెబ్ సాఫ్ట్’ అనే చైనా కంపెనీ రొటేటింగ్ సీఈవోగా నియమించుకుంది. ఈ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పని చేస్తుంది. గత నెల చివర్లోనే ఈ రోబోను సీఈవోగా నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

నెట్‌డ్రాగన్‌ వెబ్‌సాప్ట్‌ అనేది మొబైల్‌ కోసం అప్లికేషన్‌లను తయారు చేసే ఒక చైనీస్‌ కంపెనీ. ఇది మల్టిప్లేయర్‌ ఆన్‌లైన్‌ గేమ్‌లను కూడా నిర్వహిస్తుంది. కంపెనీ ప్రధాన అనుబంధ సంస్థ ఫుజియాన్‌ నెట్‌డ్రాగన్‌ వెబ్‌సాప్ట్‌ పనిని పర్యవేక్షించడానికి ఇది హ్యూమనాయిడ్‌ రోబోట్‌ను చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా నియమించింది. ఈ కంపెనీకి సంబంధించి స్ట్రీమ్‌లైన్ ప్రాసెస్, పనుల్ని వేగవంతం చేయడం వంటి పనుల్ని ఈ రోబో పర్యవేక్షిస్తుంది. కంపెనీకి రియల్ టైమ్ డాటా హబ్‌గా కూడా పనిచేస్తుంది. డైలీ ఆపరేషన్స్‌కు సంబంధించిన అంశాల్లోనూ నిర్ణయ తీసుకుంటుంది. 10బిలియన్‌ డాలర్ల విలువైన సంస్థకు నాయకత్వం వహించడానికి వర్చువల్‌ సీఈవోను సేవలను ఉపయోగిస్తున్నాం.

కంపెనీ సంస్థాగత, సమర్థతా విభాగాలను ఇది చూసుకోవాలని కంపెనీ భావిస్తోంది అని నెట్‌ డ్రాగన్‌ సీఈవో చెప్పారు. అందరు ఉద్యోగులు మరింత సమర్ధవంతంగా, ఉత్పాదకతతో పనిచేసేలా చూస్తుంది. రోబోట్‌ చాలా సబ్జెక్టివ్‌, మానవ స్పర్శ అవసరమయ్యే పనులను కూడా చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక, రోబో సీఈవోల గురించి అలీబాబా సంస్థ ఫౌండర్ అండ్ ఛైర్మన్ జాక్ మా ఐదేళ్లక్రితమే ప్రస్తావించారు. ‘‘రాబోయే 30 ఏళ్లలో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై బెస్ట్ సీఈవోగా కచ్చితంగా ఒక రోబో పేరు ఉంటుంది’’ అని జాక్ మా అన్నారు.