మనుషులకు దీటుగా మద్యం కలుపుతున్న రోబోలు..  - MicTv.in - Telugu News
mictv telugu

మనుషులకు దీటుగా మద్యం కలుపుతున్న రోబోలు.. 

June 5, 2020

Robot Serving Liquor in South Korea

కరోనా ప్రపంచాన్ని వణికించడంతో ఇప్పుడన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతికే పనిలో పడ్డాయి. మనుషులు ఎక్కువగా కలవకుండా వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఇక బార్లలోనూ ఇబ్బందులు లేకుండా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఏకంగా రోబోలే మద్యం కలుపుతూ వాటిని కస్టమర్లకు అందిస్తున్నాయి. మనుషులతో చేతులు కలపడానికి చాలా మంది వెనకాడుతుండటంతో ఈ కొత్త ఉపాయం కనిపెట్టారు. దక్షిణ కొరియాలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. వాటి పని తీరు చూసిన వారంతా తెగ ముచ్చటపడిపోతున్నారు. 

సియోల్‌లోని ఓ బార్‌లో కాబో అనే రోబోను ప్రవేశపెట్టారు. ఆరు అడుగుల ఎత్తున్న ఆ రోబో ఎంచక్కా కొరియన్ భాషలో మందుబాబులను పలకరిస్తుంది. ఏ మందు కావాలి అని అడుగుతూ ఆప్యాయంగా కలిపి చేతికి అందిస్తుంది. కావాల్సిన మందు ఆర్డర్ చేసిన వెంటనే అల్మారాలో ఉన్న ఫుల్ బాటిల్ మందు తీసుకుని గ్లాసుల్లో పోస్తుంది. అచ్చం మనిషి చేసినట్టుగానే ఐస్ ముక్కలు వేసి వాటిని మిక్స్ చేసి ఇస్తుంది. వెయిటర్ కలిపి ఇచ్చే కంటే రోబో కలిపి ఇచ్చే మద్యంపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని బార్ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. కాగా కాబో రోబోను 2017లో ప్రవేశపెట్టగా.. ఇది ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో ఇలాంటి రోబోలు సేవలను అందించగా.. ఇప్పడు బార్లలోకి కూడా ఎంట్రీ ఇచ్చాయి.