విశాఖలో వింత విషయం వెలుగు చూసింది. సాయిబాబా జనాలతో మాట్లాడుతున్నాడు. అచ్చం మనిషిలా ముఖకవళికలు, హావభావాలు, పదాలతో భక్తులను ఉపదేశిస్తున్నాడు. బాబా ఏంటీ? మాట్లాడమేంటీ? అనుకుంటున్నారా? ఇదంతా టెక్నాలజీ మహిమ. ఇది నిజం బాబా కాదు.. రోబో బాబా. విశాఖలోని చినగదిలిలోని ఉత్తర షిర్డీ సాయి ఆలయంలో ఈ రోబో గాడ్‌ను చూడడానికి ఎవరికైనా అవకాశముంది. విషయం తెలిసిన వెంటనే దర్శనం కోసం స్థానికులు క్యూ కట్టారు. ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో సమీప ప్రాంతాల నుంచి కూడా భక్తుల రాక పెరిగింది.