డ్యాన్స్ రోబో.. డ్యాన్స్... - MicTv.in - Telugu News
mictv telugu

డ్యాన్స్ రోబో.. డ్యాన్స్…

August 23, 2017

ఒకటి కాదు, పది కాదు.. ఏకంగా 1,069 రోబోలు.. రోడ్డుపై చిందేశాయి. కాళ్లూచేతులను, లయబద్ధంగా ఊపుతూ డ్యాన్స్ చేశాయి. అడుగు తడబడకుండా.. ఒకే శ్రుతిలయతో న్యాట్యం చేశాయి. ఒక్కటి కూడా తూలిపోకుండా.. ఎన్నాళ్ల నుంచో శిక్షణ తీసుకున్న డ్యాన్సర్లలా చూపర్లను విస్మయపరిచాయి. ఒకేసారి అత్యధిక రోబోలు చేసిన డ్యాన్స్ గా ఇది గిన్నిస్ రికార్డుకెక్కింది.

డబ్ల్యూ ఇంటెలిజెంట్ టెక్నాలజీ సంస్థ చైనాలోని గాంగ్జౌలో గతవారం ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. కంప్యూటర్ సింక్రనైజ్డ్ విధానంలో రోబోలను ముందుగానే ప్రోగ్రాం చేసి వాటితో నాట్యం చేయించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రోబో టెక్నాలజీతో ఇది సాధ్యమైంది.

’డోబీ’ అనే రోబోలు ఈ డ్యాన్స్  చేశాయి. ఇవి నాట్యకళలోనే కాకుండా  మాట్లాడడంలోనూ దిట్ట అట. చైనా భాషను అనర్గళంగా మాట్లాడేస్తాయట. అలాగే మనుషులు చేసే చాలా పనులను తప్పుల్లేకుండా పూర్తి చేస్తాయట.