Rocket attack on the prison in Ukraine.. 53 prisoners of war died
mictv telugu

ఉక్రెయిన్ జైలుపై రాకెట్ దాడి.. 53 మంది యుద్ధఖైదీల దుర్మరణం

July 30, 2022

ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో ఉన్న ఉన్న జైలుపై శుక్రవారం భీకర రాకెట్ దాడి జరిగింది. దీంతో యుద్ధఖైదీలుగా చిక్కిన 53 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. మరో 75 మంది గాయపడ్డారు. మరియుపోల్ నగరం హస్తగతమయ్యాక యుద్ధఖైదీలుగా చిక్కిన ఉక్రెయిన్ సైనికులను రష్యా అనుకూల వేర్పాటువాదులు ఒలెనివ్‌కా జైలులో ఉంచారు. ఆ జైలుపైనే రాకెట్ దాడి జరిగింది. దీనికి కారణం మీరంటే మీరంటూ రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. అమెరికా రాకెట్ లాంఛర్లతోనే ఉక్రెయిన్ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపించింది. ఘటనా స్థలంలో అమెరికా తయారీ రాకెట్ విడిభాగాలను గుర్తించినట్టు అధికార వార్తా సంస్థ తెలిపింది. అటు చిత్రహింసలు, మరణశిక్షల నుంచి దృష్టి మరల్చేందుకు రష్యానే ఈ దాడి చేసిందని, ఉక్రెయిన్ ప్రత్యారోపణ చేసింది.