నేపాల్‌కు వలస వెళ్తున్న రొహింగ్యాలు.. జిహాదీ సంస్థలు డబ్బుసాయం - MicTv.in - Telugu News
mictv telugu

నేపాల్‌కు వలస వెళ్తున్న రొహింగ్యాలు.. జిహాదీ సంస్థలు డబ్బుసాయం

February 20, 2020

Rohingyas getting funds from Jihadi groups to migrate to Nepal from India: Intel report

భారతదేశంలోని రొహింగ్యా ముస్లింలు నేపాల్ వలస వెళ్ళడం ప్రారంభమైంది. దాదాపు 378 మంది రొహింగ్యాలు నేపాల్ వెళ్ళారని, వారిలో కొందరు అక్కడ భూములు కొనేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చర్చలు జరిపారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నివేదిక పంపించాయి. 

వారికి జిహాదీ సంస్థలు డబ్బులు ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థతో చెప్పారు. ‘నేపాల్‌లో ఇప్పటికే స్థిరపడిన రొహింగ్యాలతో ప్రస్తుతం వలస వెళ్ళాలనుకునే రొహింగ్యాలు సంప్రదింపులు జరుపుతున్నారు. నేపాల్ పౌరసత్వ పత్రాలను సంపాదించేందుకు వేల రూపాయలు లంచాలు కూడా ఇస్తున్నారు. నేపాల్‌లో స్థిరపడేందుకు బ్రోకర్లకు దాదాపు రూ.4 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తున్నారు. రొహింగ్యాలు నేపాల్‌లో స్థిరపడేందుకు వీలుగా ఆ దేశంలోని ఇస్లామిక్ సంఘాలు నిధులు సమకూర్చుతున్నాయి. ఇటువంటి ఇస్లామిక్ సంఘాల్లో ఒకటి ఇస్లామీ సంఘ్ నేపాల్. ఈ సంఘం కార్యకలాపాలు అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయి’ అని వెల్లడించారు.

పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఉగ్రవాద స్థావరాలను భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. కాగా, రొహింగ్యాలను నేపాల్‌లో స్థిరపడేలా చేయడం వల్ల భారత వ్యతిరేక కార్యకలాపాలకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపాయి. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు తుది నిర్ణయానికి రావడం భావ్యం కాదని స్పష్టంచేశాయి.