ఢిల్లో జైలులో కరోనా కలకలం.. ఖైదీకి సోకిందని.. - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లో జైలులో కరోనా కలకలం.. ఖైదీకి సోకిందని..

May 14, 2020

Delhi

కరోనా వ్యాప్తిలో భాగంగా దేశంలోని పలు జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని రోహిణి జైలులో ఓ ఖైదీ(28)కి కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు ఖైదీకి నిన్న పరీక్షలు నిర్వహించగా.. పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. 

ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ మాట్లాడుతూ.. ‘ఆ ఖైదీ ఆరు నెలల నుంచే జైల్లో ఉంటున్నాడు. అతడికి కనీసం కరోనా లక్షణాలు కూడా కనిపించలేదు. అతనికి పేగు సంబంధిత సమస్య రావడంతో ఆదివారం దీన్ దయాళ్ ఆసుపత్రిలో చేర్పించాం. ఆదివారం అతడికి పేగు సర్జరీ కూడా జరిగింది. ఈ సందర్భంగా సోమవారం వైద్యులు అతడి శాంపిళ్లను కొవిడ్ పరీక్షలకు పంపారు. ఈ పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్టు గుర్తించారు. వైరస్ సోకిన ఖైదీకి సమీపంలో మెలిగిన ఐదారుగురు అధికారులను హోం క్వారంటైన్‌కు పంపించాం. క్వారంటైన్‌లో ఉన్న అధికారులెవరికీ కరోనా లక్షణాలు లేవు. అతను ఉండే బ్యారక్‌లోని 19 మంది ఇతర ఖైదీలను కూడా ఐసోలేట్ చేశాం’ అని గోయల్ తెలిపారు. కాగా, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ జైలులోని ఖైదీలు బయటకు వెళ్లాలనే సాకుతో కరోనాను కావాలని అంటించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరి ఎంగిలి ఒకరు తాగడం, తమ్మిన కర్చీప్‌ను పలువురు వాడటం వంటి పనులు చేసి కరోనాను కావలసి అంటించుకున్నారు.