హిట్‌మ్యాన్ బ్రాండ్ బాజా..  ఏడాదికి రూ. 75 కోట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

హిట్‌మ్యాన్ బ్రాండ్ బాజా..  ఏడాదికి రూ. 75 కోట్లు 

November 28, 2019

Rohit Sharma a big hit with 22 brands

 టీమిండియాలో ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌శర్మ చిచ్చర పిడుగులా చెలరేగిపోతున్నాడు. పరుగుల సునామీ కురిపిస్తూ దూసుకుపోతున్నాడు. మంచి ఫామ్‌లో ఉండగా.. పలు వాణిజ్య కంపెనీలు అతని వెంట పడుతున్నాయి. ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయి. దీంతో రోహిత్ సతీమణి రితికా సజ్దే ఆ వ్యవహారులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం 22 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న రోహిత్ ఎడాపెడా సంపాదించుకుంటున్నాడు. ఏడాదికి డెబ్బై ఐదు (75) కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. రోహిత్ కన్నా ముందు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉన్న విషయం తెలిసిందే. 

ప్రపంచకప్‌కు ముందు రోహిత్‌కు పెద్దగా ఎలాంటి ఒప్పందాలు లేవు. ఆ టోర్నీలో రోహిత్ సెంచరీలతో అదరగొట్టి ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి రోహిత్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల విశాఖపట్టణంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ రోహిత్ సెంచరీలతో చితక్కొట్టాడు. దీని తరువాయి రోహిత్ కోసం ప్రకటనల కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ ఒక్క సీజన్‌లోనే రోహిత్ కొత్తగా 10 ఒప్పందాలు చేసుకున్నాడు. ఏడాదికి రెండు రోజుల కనీస గ్యారెంటీతో ఒక్కో డీల్‌కు రోహిత్ కోటి రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఎండార్స్‌మెంట్ల ద్వారా కోహ్లీ ఏడాదికి రూ.200 కోట్లు సంపాదిస్తుండగా, ధోనీ కూడా బాగానే సంపాదిస్తున్నాడు.