Home > క్రికెట్ > హ‌ర్ష‌దీప్‌పై ఆగ్రహించిన రోహిత్ శర్మ..వీడియో వైరల్

హ‌ర్ష‌దీప్‌పై ఆగ్రహించిన రోహిత్ శర్మ..వీడియో వైరల్

దుబాయ్ వేదికగా గతరాత్రి ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ క్రమంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్కంఠ‌ భ‌రితంగా సాగుతున్న సమయంలో బౌలర్ హ‌ర్ష‌దీప్ ఓ కీల‌క‌మైన క్యాచ్‌ను జార‌విడిచాడు. దాంతో రోహిత్ శర్మ ఆగ్రహించాడు. కొన్ని సెకన్లపాటు హ‌ర్ష‌దీప్‌ వైపు కోపంగా చూశాడు.

వీడియోలో..18వ ఓవ‌ర్‌లో అసిఫ్ అలీ కొట్టిన స్వీప్ షాట్‌తో బంతి గాలిలోకి ఎగిరింది. చాలా ఈజీగా ప‌ట్టాల్సిన క్యాచ్‌ను..టెన్ష‌న్‌లో హ‌ర్ష‌దీప్ వ‌దిలేశాడు. ఆ స‌మ‌యంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హానికి లోన‌య్యాడు. మైదానంలో అత‌ని రియాక్ష‌న్ కెమెరాల‌కు చిక్కింది. నువ్వా, నేనా అన్న‌ట్టుగా సాగుతున్న ఆ గేమ్‌లో కీల‌క ద‌శ‌లో క్యాచ్ వ‌దిలేయ‌డంతో మ్యాచ్ పాకిస్తాన్ వ‌శ‌మైంది. దీంతో సోషల్ మీడియాలో హ‌ర్ష‌దీప్ క్యాచ్ వ‌దిలేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు తలెత్తున్నాయి.

ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో అత‌నిపై తీవ్రంగా ట్రోలింగ్ జ‌రుగుతోంది. కొంద‌రు సీనియ‌ర్లు హ‌ర్ష‌దీప్‌కు అండ‌గా నిలిచారు. 'ఒత్తిడి మ్యాచ్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు స‌హ‌జ‌మే. కావాల‌ని ఎవ‌రూ క్యాచ్‌ను వ‌దిలేయ‌రు. యువ పేస్ బౌల‌ర్‌ను నిందించ‌డం స‌రికాదు' అని హ‌ర్భ‌జ‌న్ సింగ్ అన్నాడు.

Updated : 5 Sep 2022 2:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top