టీ20లో రోహిత్ శర్మ.. ఫోర్లతో రికార్డు సాధింపు - MicTv.in - Telugu News
mictv telugu

టీ20లో రోహిత్ శర్మ.. ఫోర్లతో రికార్డు సాధింపు

July 10, 2022

టీమిండియా కెప్టెన్ కం ఓపెనర్ రోహిత్ శర్మ మరో ఘనతను సాధించారు. టీ20లలో ఎక్కువ ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా, మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో 301 ఫోర్లు బాదిన రోహిత్.. ఇంగ్లాండుతో జరిగిన రెండో టీ20లో విజయం సాధించి వరుసగా 14 విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా కూడా రికార్డు సాధించాడు. ఇక ఈ ఫార్మాట్‌లో మొదటి స్థానంలో 325 ఫోర్లతో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. సిక్సుల విషయానికి వస్తే ఇందులోనూ రోహిత్ 157 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (165) ఉన్నాడు. ఇంకా ఎంతో భవిష్యత్ ఉన్న రోహిత్ త్వరలో రెండు విధాలుగా మొదటి స్థానంలో చేరే అవకాశాలున్నాయి. కాగా, మూడు మ్యాచుల సిరీస్‌లో రెండు మ్యాచులు గెలిచి భారత్ సిరీస్ వశం చేసుకుంది. మిగిలిన మూడో మ్యాచ్ ఆదివారం రాత్రి జరుగనుంది.