పూజారాను పచ్చిబూతు తిట్టిన రోహిత్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పూజారాను పచ్చిబూతు తిట్టిన రోహిత్ (వీడియో)

October 5, 2019

టీమిండియా హిట్‌మాన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో కేక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. శతకాలు బాదుతున్న ఈ వీరుడు నోరు తూలాడు.  నాలుగు రోజు ఆటలో తమ జట్టు ఆటగాన్ని పచ్చిబూతు తిట్టాడు. అది కాస్తా సోషల్ మీడియాకు చేరడంతో రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు కూడా కోహ్లీ, ధోనీల్లాగా బూతుపురాణాలు నేర్చుకున్నాడని తిట్టిపోస్తున్నారు. 

అసలేం జరిగింది? 

రోహిత్ బ్యాటింగ్ చేస్తుండగా అటువైపు ఎండ్‌లో ఉన్న చటేశ్వర్ పుజారాతో సమన్వయం కుదరలేదు. స్పిన్ బౌలింగ్‌లో సింగిల్ కోసం బంతిని బాదిన రోహిత్ పరుగు పెట్టబోయాడు. అయితే అప్పటికే బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో అటువైపు ఉన్న పూజారా పరగుకు నిరాకరించాడు. దీన్ని సహించలేని రోహిత్ పూజారాను ‘బెహెన్చోద్’ అని తిట్టాడు. స్టంప్ మైక్‌లో అతని తిట్టు రికార్డయింది. అయితే అలా తిట్టింది రోహిత్ కాదని, పక్కనున్న ఆటగాళ్లో, ప్రేక్షకులో తిట్టి ఉంటారని రోహిత్ అభిమానులు వెనకేసుకొస్తున్నారు.