ROHIT SHARMA GOING OUT..HARDIK PANDYA TO BE INDIAS NEW T20 CAPTAIN ?
mictv telugu

ఇక రోహిత్ శర్మ అవుట్..కొత్త కెప్టెన్ అతడే..

November 18, 2022

బీసీసీఐ భారీ మార్పులకు రంగం సిద్ధం చేసింది. టీ20 వరల్డ్‌కప్ ఓటమి తర్వాత టీం ఇండియా భవిష్యత్తుకు ప్రణాళికలను రచిస్తోంది. టీ20లో సీనియర్లను పక్కనబెట్టి యువకులకు పెద్దపీట వేయాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నారు. రానున్న రెండు సంత్సరాలలో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ సారథ్యంలో ఎన్నో అంచనాలతో టీ20 వరల్డ్ కప్ కోసం టీం ఇండియా ఆస్ట్రేలియా వెళ్లింది. ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ట్రోపీ అందించిన రోహిత్ ..ఈ సారి టీఇండియాకు కూడా వరల్డ్ కప్ తెచ్చిపెడతాడని భారత్ అభిమానులు భావించారు. చివరికి సెమీ ఫైన్‌ల్లో ఓటమి చవిచూసి ఇంటిదారి పట్టింది. దీంతో బ్యాటింగ్‌లోనూ, అటు కెప్టెన్సీలోనూ విఫలమైన రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సమయంలోనే సీనియర్స్ ను టీ20 నుంచి పక్కనబెట్టి కుర్రాళ్ళను ఆడిచించాలని మాజీలనుంచి సలహాలు, సందేశాలు భారీగా వచ్చాయి.

మూడు ఫార్మెట్లకు కెప్టెన్సీగా ఉన్న రోహిత్ శర్మను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించనున్నట్లు తాజాగా ఓ బీసీసీఐ అధికారి చెప్పారని ఇన్‎సైడ్ స్పోర్ట్స్ తన కథనంలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో ఉన్న శ్రీలంకతో సిరీస్‌కు ముందు హార్దిక్‌ను ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమిస్తారని ఆ అధికారి చెప్పినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న భారత్ టీ20 జట్టుకు ప్రస్తుతం హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా పాండ్య పర్వాలేదనిపించాడు. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌కు ‌ కప్పు‌ని తెచ్చిపెట్టాడు. తన ఫిట్‌నెస్‌ను కాపుడుకొని టీ20లో రాణిస్తే మాత్రం హార్దిక్ పాండ్యను భారత్ టీ20 జట్టుకు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా చూడొచ్చు.