నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ టీమిండియా 132 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ ఘన విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే తొలి టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్ అశ్విన్ వేశాడు. ఈ ఓవర్‌లో పీటర్ హ్యాండ్స్‌కాంబ్.. బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, బంతి బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో బౌలర్ అశ్విన్ ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. కానీ, అంపైర్ అది నాటౌట్ అని తలఊపాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్(రివ్యూ)కు వెళ్లాడు. ఈ సమయంలో కెమెరామెన్ అది ఔటా కాదా అని రీప్లేలను చూపించకుండా రోహిత్ శర్మను స్క్రీన్‌పై చూపించాడు.
Mera ko kya dikha raha review dikha🤣🤣 pic.twitter.com/7UMR2RdfZu
— Lala (@FabulasGuy) February 11, 2023
స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూసి అసహనానికి గురైన రోహిత్ ‘నన్నెందుకు చూపిస్తున్నావ్.. రివ్యూ చూపించు’ అని కెమెరామెన్ వైపు చూస్తూ సీరియస్‌గా అన్నాడు. దీంతో పక్కన సూర్యకుమార్ యాదవ్, షమి, అశ్విన్ కాసేపు నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఆ రివ్యూలో హ్యాండ్స్‌కాంబ్ ఔట్ అయినట్లు తేలింది.