టెస్ట్ సిరీస్ ముగిశాక వన్డేలకు భారత్-ఆసీస్ టీంలు సిద్ధమవుతున్నాయి. మార్చి 17వ తేదీ నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 2-1తో టెస్ట్ సిరీస్ ను దక్కించుకున్న భారత్ వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. ఆస్ట్రేలియా సైతం టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇక వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
వెన్నునొప్పి కారణంగో అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మొదటి వన్డేకు అందుబాటులో ఉండడం లేదు. తన భార్య రితికా సోదరుడు కృనాల్ పెళ్లి సందర్భంగా మొదటి వన్డే నుంచి తప్పుకున్నాడు. రోహిత్ గైర్హజరితో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అయితే రోహిత్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కుటుం సభ్యులు చనిపోతేనే పలువురు ఆటగాళ్ళు దేశం కోసం ఆడారని..అలాంటిది బావ మరిది పెళ్లి కోసం జట్టునుంచి తప్పుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశం కంటే బావమరిది గొప్పనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కొంతమంది మాత్రం రోహిత్ నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చారు. . సొంత బావమరిది పెళ్లికి వెళ్లడం తప్పులేదని రోహిత్ కి మద్దతు పలికారు. .
ఏదేమైనప్పటికీ తొలి మ్యాచ్ లో హిట్ మేన్ రోహిత్ కనిపించకపోవడం ఆయన అభిమానులకు పెద్ద నిరాశే. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తల్లి మరణం నేపథ్యంలో దూరం అవ్వడంతో.. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ పగ్గాలు అప్పగించారు.