శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ బోణి కొట్టింది. విరాట్ సెంచరీతో వీరవిహారం చేస్తే..రోహిత్, గిల్లు అర్థ సెంచరీలతో అదరగొట్టారు. తర్వాత బౌలర్లు కూడా రాణించడంతో భారత్‌ను విజయం వరించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 373 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులు వద్ద నిలిచిపోయింది. 206 కే 8 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయం చేసుకున్న శ్రీలంకను ఆ టీమ్ కెప్టెన్ శనక రేసులోకి తీసుకొచ్చాడు. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ సెంచరీ సాధించాడు. తొమ్మదో వికెట్‌కు రజితతో కలిసి ఏకంగా 100 పరుగల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
Rohit Sharma on refused non strike run-out on Dasun Shanka.
Great from Captain Rohit Sharma. pic.twitter.com/MmF9ou3LYN
— CricketMAN2 (@ImTanujSingh) January 10, 2023
అయితే శనకా సెంచరీకి రెండు పరుగుల దూరం అంటే 98 వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. షమీ బౌలింగ్ వేస్తున్న సమయంలో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న శనకా క్రీజ్ దాటి వెళ్లిపోవడంతో బౌలర్ వికెటన్లు కొట్టి ఔట్ కోసం అంపైర్‌కి అపీల్ చేశాడు.దీనిపై ఫీల్డ్ అంపైర్.. థర్ అంపైర్‌ని సంప్రదించగా షమీ వికెట్లను కొట్టే సమయంలో శనకా క్రీజ్ బయట ఉన్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే రోహిత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి అప్పీల్‌ను వెనక్కు తీసుకోవడంతో తర్వాత శనకా బ్యాటింగ్ కొనసాగించి సెంచరీ చేశాడు. రోహిత్ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
That’s that from the 1st ODI.#TeamIndia win by 67 runs and take a 1-0 lead in the series.
Scorecard – https://t.co/262rcUdafb #INDvSL @mastercardindia pic.twitter.com/KVRiLOf2uf
— BCCI (@BCCI) January 10, 2023
శనకు ఔట్ చేయకపోవడానికి గల కారణాలను రోహిత్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. శనకా ఆడిన విధానం అద్భుతం, అందుకే మన్కడింగ్ ద్వారా ఔట్ చేయాలని మేం భావించలేదని స్పష్టం చేశాడు. శనక అసాధారణ పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు అని రోహిత్ శర్మ ప్రశంసించాడు.