ఎన్డీ తివారీ కొడుకు ఆకస్మిక మృతి - MicTv.in - Telugu News
mictv telugu

 ఎన్డీ తివారీ కొడుకు ఆకస్మిక మృతి

April 16, 2019

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, యూపీ, ఉత్తరాఖండ్‌ల మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ ఈ రోజు ఆకస్మికంగా చనిపోయారు. ఢిల్లీలోని సాకేత్‌ మ్యాక్స్‌ ఆస్పత్రిలో ఆయన మృతదేహం కనిపించింది. ఆయన అక్కడికి చేరేసరికే విగతజీవిగా మారినట్లు తెలుస్తోంది. ఎందువల్ల చనిపోయారన్నది తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్డీ తివారీ గత ఏడాది అక్టోబరులో చనిపోయారు. రోహిత్‌ను ఆయన మొదట తన కొడుకుగా ఒప్పుకోలేదు. రోహిత్, అతని తల్లి ఉజ్వల కోర్టులో సుదీర్ఘ పోరాటం చేశారు. దీంతో తివారీ వారిని తన భార్యా, బిడ్డగా అంగీకరించారు. రోహిత్ రెండేళ్ల కిందట బీజేపీలో చేరారు.