Rohit yesterday.. Kohli today.. Injuries haunting
mictv telugu

నిన్న రోహిత్..నేడు కోహ్లీ..వెంటాడుతున్న గాయాలు

November 9, 2022

టీ 20-2022 వరల్డ్ కప్ చివరి దశకు వచ్చేసింది. భారత్ కప్పుకొట్టేందుకు మరో అడగులు మాత్రమే ఉన్నాయి.సెమీస్‌లో గురువారం ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలని టీ ఇండియా భావిస్తోంది.ఈ సమయంలో కీలక ఆటగాళ్లు గాయపడుతున్నారన్న వార్తలు భారత్ అభిమానులను కలవరపెడుతున్నాయి. మంగళవారం రోహిత్ గాయపడగా నేడు కోహ్లీ గాయపడ్డాడు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో 246 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఉన్నాడు. పాకిస్తాన్‌పై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ కోసం ఎంత చెప్పిన తక్కువే. టీ ఇండియాకు ఒంటిచేత్తో విజాయాలను అందిస్తున్న కోహ్లీ గాయపడ్డాడనే వార్త క్రికెట్ అభిమానులను కంగారుపెడ్తోంది.

ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం తీవ్రంగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌‌లో కోహ్లీకి గాయమైంది. ఓ బౌన్సర్ విరాట్ కోహ్లీ గజ్జల్లో బలంగా తాకడంతో కాసేపు విలవిలలాడిన కోహ్లీ, ప్రాక్టీస్ సెషన్స్‌ నుంచి బయటికి వెళ్లాడనే వార్త అభిమానులను షాక్‌కి గురి చేసింది. అయితే అది స్వల్ప గాయమేనని.. పెద్దగా భయపడాల్సిన పనిలేదని బీసీసీఐ వెల్లడించింది. గాయం తర్వాత కూడా కోహ్లీ ప్రాక్టిస్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.