Rohith sharama recovery for his injurey
mictv telugu

భారత్‌కు గుడ్‌న్యూస్..మళ్లీ బ్యాట్ పట్టిన రోహిత్ శర్మ

November 8, 2022

Rohith sharama recovery for his injurey

గాయం కారణంగా సెమీస్‌లో ఇంగ్లాండ్ మ్యాచ్‌కు టీ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అవుతాడానే వార్తలకు చెక్ పడింది. నెట్ ప్రాక్టిస్‎లో గాయపడిన రోహిత్ శర్మ కోలుకున్నాడు. ఆయన మళ్ళీ నెట్స్‎లో ప్రాక్టీసు చేస్తూ కనపడ్డాడు. దీంతో భారత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఆడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. దీని కోసం భారత్ ఆటగాళ్లు నెట్స్‎లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రాక్టిస్ చేస్తుండా రోహిత్ శర్మ చేతికి గాయమైంది. దీంతో అతడు టోర్నీకి దూరమవుతాడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, చికిత్స తీసుకుని కొద్ది సేపటికే రోహిత్ శర్మ మళ్ళీ ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

ఈ సారి ఎలాగైనా టీ 20 వరల్డ్ కప్ కొట్టాలని బరిలోకి దిగిన టీం ఇండియా అంచనాలకు తగ్గట్టు రాణిస్తోంది. టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. సూపర్-12 దశలో సౌతాఫ్రికాతో మినహా అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన రోహిత్ సేన.. గ్రూప్-2 టాపర్‌గా సెమీఫైనల్ చేరింది. గురువారం జరగనున్న రెండో సెమీ ఫైనల్లో గ్రూప్-1 రన్నరప్ అయిన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. T20 లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు విజయం సాధించగా ఇంగ్లండ్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.