మూడో వన్డేలో న్యూజిలాండ్ బౌలర్లను భారత్ ఓపెనర్లు ఉతికిఆరేశారు. ఇద్దరు మెరుపు సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీస్కార్ దిశగా పయనిస్తోంది. రోహిత్ 83 బంతుల్లో సెంచరీ అందుకుంటే.. యువ ఓపెనర్ గిల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 72 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించిన రోహిత్‌కు ఇది 30వ సెంచరీకాగా, గిల్ కెరీర్లో నాల్గొవది. ప్రస్తుతం భారత్ 28 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. సెంచరీ అందుకున్న తర్వాత మరింత వేగంగా ఆడే క్రమంలో రోహిత్, గిల్ ఔటయ్యారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషాన్ క్రీజ్‌లో ఉన్నారు.
అదిరే ఆరంభం
బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఇండోర్ పిచ్‌పై ఓపెనర్లు ఇద్దరు పోటీపడి బౌండరీలు సాధించారు. మొదట ఆచితూచి బ్యాటింగ్ చేసిన రోహిత్, గిల్ తర్వాత గేరు మార్చారు. వచ్చిన బంతి వచ్చినట్టుగానే స్టాండ్‌లోకి పంపించేస్తుండడంతో న్యూజిలాండ్ బౌలర్లకు బంతి ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకోవాల్సి వచ్చంది.ఈ జోడి మొదటి వికెట్‌కు 212 పరుగులు సాధించింది.