న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రోహిత్(85 బంతుల్లో 101), గిల్(78 బంతుల్లో 112) శతకాలకు తోడు హార్దిక్(38 బంతుల్లో 54) అర్ధ సెంచరీ సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. ఒక దశలో స్కోరు 400 దాటుతుందని భావించినా చివరిలో మిగతా బ్యాట్స్మెన్లు విఫలం కావడంతో కాస్త పరుగులు వేగం తగ్గింది. న్యూజిలాండ్ బౌలర్లలో డఫ్పీ, టిక్నర్ మూడేసి వికెట్లు తీయగా, బ్రేస్‌వెల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
గిల్, రోహిత్ వీర బాదుడు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కివీస్ బౌలర్లను చితక్కొట్టారు. వీరి ధాటికి ఇండోర్ మైదానంలో పరుగుల వరద పారింది. పోటీ పడి బౌండరీల వర్షం కురిపించారు. 33 బంతుల్లో గిల్ అర్థసెంచరీ సాధిస్తే..రోహిత్ 41 బంతుల్లో అందుకున్నాడు. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించాక మరింత దూకుడు పెంచారు. చూస్తుండగానే సెంచరీలు సాధించారు. అదే ఊపును కొనసాగిస్తే డబుల్ సెంచరీలు నమోదవతాయనే ఆశతో భారత్ అభిమానులు ఆశగా ఎదురు చూసారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరు పెవిలియన్‌కు చేరారు. మొదటి వికెట్‌కు 212 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.తర్వాత వచ్చిన బ్యాటర్లలో హార్దిక్ అర్థ సెంచరీ తప్ప ఎవరూ రాణించకపోవడతో భారత్ ఆశించిన భారీ స్కోర్ చేయలేకపోయింది. విరాట్ (36 పరుగులు) పర్వాలేదనింపించినా, సూర్యాకుమార్(14), ఇషాన్ కిషన్(17), వాష్టింగ్టన్ సుందర్(9), నిరాస పరిచారు. శార్ధూల్ ఠాకూర్(17 బంతుల్లో 25) పరుగులు చేశాడు. స్వల్ప వ్యవధిలోనే వీరు ఔట్ కావడంతో కాస్త స్కోర్ బోర్డు నెమ్మదించింది.
రికార్డులే రికార్డులు
మూడో వన్డేలో మూడేళ్ల తర్వాత సెంచరీ అందుకున్న రోహిత్ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఓపెనర్‌గా పదేళ్లు పూర్తి చేసుకున్న రోహిత్..వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు సాధించినా ఆటగాళ్ల జాబితాలో రోహిత్(271 సిక్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు.అతడి కంటే ముందు షాహిద్ ఆఫ్రిది(351), క్రిస్ గేల్(331) ఉన్నారు. మరోవైపు అతి తక్కువ మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించిన భారత్ ఆటగాడిగా శుభమన్ గిల్ రికార్డులకెక్కాడు. ద్వైపాక్షిక సిరీసుల్లో అత్యధిక పరుగులు సాధించి భారత్ బ్యాట్స్ మెన్ గా కూడా గిల్ రికార్డు సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్‌లో 360 పరుగులు సాధించాడు. వీటిలో ఒక డబుల్, ఒక సెంచరీ ఉన్నాయి.