RohithReddy-Swamiji Audio Leaked In Farmhouse Case
mictv telugu

10నిమిషాల ఆడియో..నెంబర్ 1,2 వాళ్లేనా?

October 28, 2022

FarmHouse Case,Audio leaked,MLA Rohith Reddy,RamachandraBhatathi,Telangana

ఫామ్‌హౌస్ కేసులో ఆడియో బయటకొచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి-స్వామీజీ రామచంద్రభారతి మధ్య సంభాషణ జరిగింది. పది నిమిషాల నిడివి విన్న ఆడియోలో ఇద్దరు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. నెంబర్ 1, నెంబర్ 2 పేర్లు తెరపైకి తెచ్చారు. ఎవరి నెంబర్ 1,నెంబర్ 2 అనేది ఉత్కంఠరేపుతోంది? అంతా బీఎల్ సంతోష్ చూసుకుంటారు..మీకు ఏ ప్రాబ్లమ్ రాదు..మీరు మా స్కానర్‌లో ఉన్నారంటూ రామచంద్రభారతి చెప్పారు. ఈ నెంబర్ 1 , నెంబర్ 2 బీజేపీకి చెందిన వాళ్లేనా?టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు రెడీగా ఉన్నారని రోహిత్ ఆడియోలో వుంది.మరి నాలుగో ఎమ్మెల్యే ఎలా అంటారయ్యారు?

ఎవరీ బీఎల్ సంతోష్

“బీఎల్ సంతోష్ మా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ. ప్రభుత్వ ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తారు. ఏ నిర్ణయమైనా బీఎల్ సంతోషే తీసుకుంటారు. ఆ తర్వాత నెంబర్ 2 దగ్గరకు వెళ్లి కలుద్దాం..ఒకరిద్దరు వస్తే బాగుంటుంది..ఎల్ సంతోష్ వచ్చి అంతా చూసుకుంటారు..”ఇది స్వామిజీ ఆడియోలో చెప్పింది. ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ బయటకురాగానే బీఎల్ సంతోష్ పేరు తెరపైకి వచ్చింది. బెంగళూరు కేంద్రంగా డీల్స్ చేస్తారని టాక్. ఆర్ఎస్సెస్ ప్రచారక్‌గా కేరీర్ మొదలుపెట్టిన సంతోష్ ..బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎదిగారు. 2014 నుంచి ఈ పదవిలో ఉన్నారు. అమిత్ షా టీమ్‌లో కీలకనేత.ఇతనిపై అమిత్ షాకు మంచి నమ్మకం వుంది. అందుకే దక్షిణాది వ్యవహారాలు అన్నీతానై చూస్తారని ప్రచారం పార్టీలో వుంది. యడ్యూరప్ప తర్వాత సీఎం రేసులో బీఎల్ సంతోష్ పేరు కూడా వినిపించింది. అప్పట్లో కొన్ని కులాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చరచ్చకు కారణమయ్యారు. ఇప్పుడు ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌లో ఆయన పేరు కీలకంగా వినిపిస్తోంది.

నెంబర్ 1 నెంబర్ 2 వాళ్లేనా?

ఈ ఆడియోలో నెంబర్ 1,నెంబర్ 2 ప్రస్తావన కీలకం.వీళ్లు పక్కా బీజేపీకి చెందిన నేతలే. ఎందుకంటే వాళ్లను కలిపిస్తామని
రోహిత్ రెడ్డితో స్వామీజీ అన్నారు. జంపింగ్ జపాంగ్ విషయంలో బీజేపీలో నెంబర్ 1, నెంబర్ 2 నడ్డా అని రాజకీయాలు తెలిసిన అందరికి ఎరుక. ఎవరు చేరాలన్నా వీరిని ముందు కలుస్తారు. చర్చలు సఫలమైతే వారి సమక్షంలోనే చేరుతారు.

ఆడియోలో అడ్వాన్స్ అయ్యిందెవరు?

10 నిమిషాల ఆడియోని నిశితంగా వింటే చాలా విషయాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముందుగా ఓపెన్ అయ్యారని తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా స్వామీజీ ఆచితూచి మాట్లాడారు. అన్ని షార్ట్ కట్ మాట్లాడుతూ మేనేజ్ చేశారు. ఒక్క బీఎల్ సంతోష్ పేరు తప్ప అన్ని కోడింగ్ లాంగ్వేజ్‌లో చెప్పారు.

టాప్ సీక్రెట్‌గా ఉంచాలని…

“మా సీఎం దూకుడు తెలుసుగా..దయచేసి ఇది టాప్ సీక్రెట్ గా ఉంచాలి. తేడా వస్తే మా పనైసోతుంది”అని రోహిత్ రెడ్డి అన్నారు. “ఏమైనా తేడా వస్తే మేం చూసుకుంటాం.కేంద్రం నుంచి సహకరిస్తాం..ఈడీ నుంచి ఐటీ వరకు మీ భద్రతను మేం చూసుకుంటాం”అని స్వామీజీ చెప్పారు.

నాలుగో ఎమ్మెల్యే ఎలా ఎంటర్ అయ్యారు.

“పేర్లు చెప్పడం కష్టం.ఇప్పటికి ఇద్దరు కన్పర్మేషన్ ఇచ్చారు.మేం ముగ్గురం రెడీగా ఉన్నాం.కలిసి మాట్లాడితే బాగుంటుంది” రోహిత్ రెడ్డి ఆడియోలో ఉంది. మరి నాలుగో ఎమ్మెల్యే ఎవరు?ఎలా ఎంటర్ అయ్యారు? నందు ప్రస్తావన తప్ప నిందితుల్లో మూడో వ్యక్తి పేరు సంభాషణల్లో ఎక్కడ లేదు. ఫామ్‌హౌజ్‌కు ఎందుకు పిలిపించారు.

వంద కోట్ల ప్రస్తావన లేదు

ఈ 10నిమిషాల ఆడియోలో డబ్బుల ప్రస్తావన ఎక్కడ లేదు. మరి రూ.100కోట్ల ఫిగర్ ఎలా బయటకు వచ్చింది. రోహిత్ రెడ్డికి రూ.100కోట్లు, మిగతావారికి రూ.50 కోట్ల చొప్పున ఇస్తామన్నారని ప్రచారం జరిగింది. కానీ ఆడియోలో ఎక్కడ ఆ విషయం గురించి మాట్లాడలేదు. డీల్ ఫిగర్స్ తొలి నుంచి సస్పెన్స్‌గా ఉన్నాయి. దీంతో పాటు ఇంకా ఎన్ని ఆడియోలు ఉన్నాయా?క్షుణ్ణంగా విన్న తర్వాతే బయటకు వదులుతున్నారా?