Rohtak villagers gift Rs 2.11 crore, SUV to man who lost sarpanch's election
mictv telugu

ఎన్నికల ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి సర్ప్రైజ్ గిఫ్ట్స్

November 20, 2022

హరియాణాలోని రోహ్‌తక్‌ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని చిరీ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి గ్రామస్థులు రూ.2.11 కోట్ల నగదుతో పాటు ఓ స్కార్పియో ఎస్‌యూవీ కారును కానుకగా అందించారు. చిరీ గ్రామంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. నవీన్ దలాల్, ధర్మపాల్‌ దలాల్‌ అనే నాయకులు పోటీ పడ్డారు. ఇందులో ధర్మపాల్ కేవలం 66 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అతి కొద్ది తేడాతో ఓడిపోయిన ధర్మపాల్‌ నైరాశ్యంలో మునిగినా.. గ్రామస్థులు ప్రదర్శించిన పెద్ద మనసుతో పటాపంచలైంది. అతనికి ఆ గ్రామస్థులంతా కలసి రూ.2 కోట్ల నగదుతో పాటు 11 కోట్ల ఖరీదైన కారు (ఎస్‌యూవీ)ను బహుమతిగా అందజేశారు. హర్యానాలోని చీడి గ్రామంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నవంబర్ 12న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చీడి గ్రామంలో ధర్మపాల్ దలాల్ అలియాస్ కాలా ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం ఊర్లో ఎలాంటి విద్వేషాలు చెలరేగకుండా ఉండేందుకు, సోదర భావాన్ని చాటేందుకు ధర్మపాల్‌కు గ్రామస్థులంతా కలిసి అత్యంత ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ పరిణామంపై ధర్మపాల్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

తాను సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయి ఆత్మస్థైర్యం కోల్పోయినప్పటికీ.. గ్రామస్తులు తనపై చూపుతున్న ప్రేమను చూసి ఆనందం వేస్తుందని చెబుతున్నాడు. ఓడిపోయినా గ్రామస్తుల చూపించిన ప్రేమాభిమానాలతో తాను అంతకుమించి పనిచేస్తానని, వారిచ్చిన డబ్బులను సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెడతానని చెబుతున్నాడు.