తల్లీ రోజా - అయ్యా బాబూ.. మీకేమైనా వుందా ? - MicTv.in - Telugu News
mictv telugu

తల్లీ రోజా – అయ్యా బాబూ.. మీకేమైనా వుందా ?

June 29, 2017

జబర్దస్త్ .. ఈ ప్రోగ్రాం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సిగ్గూ – శెరం – లజ్జా – ఇజ్జత్.., ఇలా ఏదీ పాటించని వన్ అండ్ ఓన్లీ బెహెత్రీన్ ప్రోగ్రాం ఏదంటే జబర్దస్తే. దీని షాన్ దార్ తనం గురించి చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు అందరూ చాలా.. చాలా.. గో.. ప్పగా చెప్తారు. పోర్న్ కు ఏమాత్రం తీసిపోని జబర్దస్త్ ఇలా మూడు ఇకిలి నవ్వులు – ఆరు బూతు సెటైర్లతో నడవడం వెనుక మరో గో.. ప్ప రహస్యం ఏంటంటే గులాబీలా నవ్వే రోజా అండ్ బూతు వదలగానే ఫక్కున ముఫ్పై రెండు పళ్ళు బయటపెట్టి నవ్వే బాబుగార్లే !

ఆది నువ్వు సూపర్, చంద్రా హిలేరియస్ గా చేసావ్, ఇంకొంచెం డోసు పెంచుంటే అద్దిరిపోయేది, శాంతీ.. నీ గెటప్ ఆ పంచు డైలాగులతో నా మతి పోగొట్టావ్ పో.. అంటూ రోజా – నాగబాబు గార్లు వాళ్ళకిచ్చే కితాబు వీర లెవల్లో వుంటుంది మరి. వీళ్ళిచ్చే మార్కుల కోసం, కామెంట్ల కోసం బారెడు నాలుక తెరుచుకున్న కుక్కలా ఎదురు చూస్తుంటారు కంటెస్టెంట్స్. వాళ్ళ నోటి నుండి తమ పేరుని పిలిపించుకోవాలని తగె ఉబలాట పడుతుంటారు. రోజా – నాగబాబులు రియల్ లైఫ్ లో కూడా ఇలాగే తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారా ? తమ కూతురో, భార్యో, భర్తో ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే వహ్వా.. క్యా పంచ్ హై యార్.. అని మార్కలే కాదు ఎక్స్ ట్రా కామెంట్ల తాయిలాలు కూడా ఇస్తారా ?

వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి ఆ ప్రోగ్రాంని చూస్తూ ఎంజాయ్ చెయ్యగలరా ? ‘ చూడోయ్ నేనిచ్చిన మార్కులకు వాళ్ళ లైఫే టర్న్ అయిపోయిందని ’ వాళ్ళింట్లో డాంబికంగా చెప్పుకోగలరా ? పిల్లలూ మీరంతా జబర్దస్త్ ప్రోగ్రాంలోల పంచ్ బూతులు వదులుతూ మాట్లాడండి మేము మజా చేస్తామని అనగలరా ? అందులో వేసే స్కిట్లలోలా నాగబాబు గారు ఆయన అర్ధాంగితో అలాగే వ్యవహరించగలరా ? రోజాతో సెల్వమణి అంత నీఛంగా ప్రవర్తిస్తే ఇదంతా జస్ట్ ఫన్, ఫుల్లు నవ్వొచ్చిందండీ అని భర్తకి కితాబివ్వగలదా

సదరు రోజమ్మ ?కూతురు హీరోయిన్, కొడుకు హీరో, తండ్రేమో బూతు కామెడీ షోకు హోస్ట్, బ్రదర్స్ ఇద్దరూ స్టార్లు.., వహ్ క్యా ఖాన్ దాన్ హై యార్ ?? ఇక రోజా గారి విషయం తీస్కుంటే ఆవిడ ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధి అయి వుండి ఇలాంటి షోలో పళ్ళు ఇకిలించడం ఎంత వరకు మ్యాచ్ అవుతుంది ? ఈ ప్రోగ్రాం వల్ల ఎంత మంది ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బ తింటున్నాయో ప్రజా నాయకురాలిగా వున్న రోజమ్మ ఒక్కసారన్నా ఆలోచించిందా ? తను MLA పదవికి నప్పుతుందా ? ఒక ఆడదై వుండి కేవలం డబ్బు కోసం, ప్రోగ్రాం రేటింగ్ కోసం ఇలా దిగజారటం ఎంత వరకు కరెక్ట్ ?

ఇద్దరు అన్నదమ్ములు స్టార్లు, తనేమో జీరో ? అడపాదడపా సినిమాల్లో ఎన్ని వేషాలు వేసినా తనకు పాప్యులారిటీ రావడం లేదని నాగబాబు గారు పాపం చాలా బెంగ పెట్టుకున్నట్టున్నారు. ఆయన మొరను ఆలకించిన బూతమ్మ జబర్దస్త్ రూపంలో కావాల్సినంత ఫుల్లు పబ్లిసిటీనిచ్చింది. ఒక్కసారిగా పేరొచ్చేసరికి నగాబాబు గారు ఉచ్చ నీఛాలు మరిచి చిచోర కామెడీకి ఎగిరెగిరి గెంతులేస్తున్నారు. సమాజానికి పనికొచ్చే సెలెబ్రిటీలేనా వీళ్ళు ? కనీసం ఈటీవీ, మల్లెమాల వాళ్ళకైనా ఆడవాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బ తింటున్నాయో ఆలోచించాల్సిన అవసరం లేదా ? ఒక మహిళ అయి వుండి సాటి మహిళలను స్కిట్ల రూపంలో అవమానిస్తుంటే రోజా పగలబడి నవ్వటం అస్సలు బాగా లేదని పలు మహిళా సంఘాలు రోజమ్మ మీద పీకల్లోతు కోపంలో వున్నాయి. తల్లీ రోజా, బాబూ.. మీకేమైనా వుందా అని చాలా మంది గుర్రు గుర్రుమంటున్నారు.

కంటెస్టెంట్లతో కాళ్ళు మొక్కించుకొని దేవుళ్ళలా పోజుకొడ్తున్న వీళ్ళకు బూతు నైవేద్యాలే నచ్చుతాయేమో ! ?