Roja's audio leak on dissident faction
mictv telugu

మాకు మెంటల్ ఎక్కిపోతోంది.. కలకలం రేపుతున్న మంత్రి రోజా ఆడియో

October 17, 2022

Roja's audio leak on dissident faction

సొంత నియోజకవర్గంలో రేగుతున్న అసమ్మతిపై ఏపీ మంత్రి రోజా ఆవేదన చెందుతూ మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. సోమవారం పలు మీడియా ఛానెళ్లలో ఆడియో ప్రసారం కాగా, రాజకీయంగా కలకలం రేపుతోంది. విశాఖ గర్జన అనంతరం మంత్రి రోజా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే.. మంత్రి రోజా నియోజకవర్గమైన నగరి పరిధిలోని నిండ్ర మండలం కొప్పెడలో రైతు భరోసా కేంద్రానికి ఆమె వ్యతిరేక వర్గం భూమి పూజ చేసింది.

దీనికి శ్రీశైలం దేవస్థానం చైర్మెన్ చక్రపాణి రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కేజే శాంతి హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే ప్లస్ మంత్రి అయిన రోజాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. దీంతో మంత్రి ఫైర్ అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడియో ప్రకారం.. ‘నియోజకవర్గంలో నన్ను వీక్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ కోసం ప్రాణం పెట్టి పని చేస్తుంటే రోజూ మాకు మెంటల్ టెన్షన్ పెడుతున్నారు. అన్ని రకాలుగా నష్టం జరుగుతుంటే టీడీపీ, జనసేన పార్టీ నాయకులు నవ్వుకుంటున్నారు. నాకు నష్టం జరిగే విధంగా వ్యతిరేక వర్గం భూమి పూజ చేయడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. ఇలాంటి వాళ్లు పెరిగితే మాకు రాజకీయాలు చేయడం కష్టమవుతుంది. ఈ పరిణామాలు చూస్తుంటే బాధేస్తుంది’ అంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు.