20 ఏళ్ల తర్వాత మళ్లీ అతిదగ్గరగా.. - MicTv.in - Telugu News
mictv telugu

20 ఏళ్ల తర్వాత మళ్లీ అతిదగ్గరగా..

August 17, 2017

కేట్ విన్స్ లెట్.. గుర్తుందా? సరిగ్గా 20 ఏళ్ల కిందట వచ్చిన టైటానిక్ సినిమాలో తళుక్కుమని దేశదేశాల్లోని కుర్రకారును ఉర్రూతలూగించిన సౌందర్యరాశి. ఆ సినిమారో హీరో, చాకులాంటి కుర్రాడు లియోనార్డో డికాప్రియోతో కలసి ఆమె పండించిన రొమాంటిక్ సీన్లను ఎన్నటికీ మరిచిపోలేం. ఆ మహానౌకలోని ఓ గ్యారేజ్లో.. ఎవరికంటా పడకుండా డికాప్రియో.. కేట్ ను నగ్నంగా పడుకోబెట్టి గీసే బొమ్మ, తర్వాత వారి ప్రణయం.. వంటి మరెన్నో దృశ్యాలు క్లాసిగ్గా నిలిచిపోయాయి. ఆ సినిమాలో నటించేటప్పడు వారి వయసు దాదాపు 20 ఏళ్లు.

తర్వాత ఇద్దరూ మరో సినిమాలో, కేన్స్ వంటి సినిమా వేడుకల్లో తళుక్కుమన్నారు. అయితే టైటానిక్ లో మాదిరి అత్యంత దగ్గరగా, ప్రేమగా, మురిపెంగా, రొమాంటిగ్గా మాత్రం ఇటీవలే కనిపించారు. ఇరవయ్యేళ్ల గ్యాప్ తర్వాత.. నలభై, నలభై రెండేళ్ల వయసులో తిరిగి దగ్గరైన వారిని చూస్తుంటే.. కాస్త పెద్దవాళ్లయ్యారు తప్పితే టైటానిక్ నాటి రొమాన్స్ పిసరంత కూడా తగ్గలేదని అనిపించడం లేదూ.. కాని మొత్తానికి టైటానిక్ సీన్లతో పోలిస్తే.. తేడా కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది.. అయినా ప్రేమకు వయసుతో పనేముందితెండి..