Romantic song release from Ligar
mictv telugu

లైగర్ నుంచి రొమాంటిక్ సాంగ్.. ‘ఆఫతే’ అంటూ ట్రెండింగ్‌లో రచ్చ

August 6, 2022

విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం లైగర్ నుంచి రొమాంటిక్ సాంగ్ శనివారం రిలీజయింది. ఆఫత్ అంటూ సాతే ఈ పాటలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. దీన్ని షేర్ చేస్తూ విజయ్ ‘రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. సంగీతం, కెమెరా ఆకట్టుకుంటున్నాయి. అమ్మాయిల గురించి రమ్యక‌ృష్ణ చెప్పే డైలాగులో ప్రారంభమయ్యే ఈ పాట ఎక్కువ భాగం బీచ్‌లో సాగుతోంది. రిలీజయిన కొద్ది సేపటికే రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తోంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న తెలుగు, హిందీ, మలయాళ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజవుతోంది. కాగా, ఈ చిత్ర ప్రమోషన్‌ను చిత్ర బృందం ఇప్పటికే ప్రారంభించింది. దేశవ్యాప్తంగా రిలీజవుతుండడంతో విజయ్ దేవరకొండ తాజాగా బీహార్‌లోని పాట్నాలో దర్శనమిచ్చాడు. అక్కడ స్థానికంగా ఉండే గ్రాడ్యుయేషన్ టీ షాపులో టీ తాగి అభిమానులను అలరించాడు. ఇప్పటికే డిజిటల్ రైట్స్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయిన ఈ చిత్రం థియేటర్లలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.