యూట్యూబ్ రొమాంటిక్ స్టార్ స్వాతి నాయుడు తల్లి అయ్యారు. మే 25న డెలివరీ డేట్ ఇచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆమె.. ఆ తేదీ కన్నా ముందే, మే 10న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డను చూసుకుని స్వాతి, అవినాశ్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఆమెకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘నా బేబీ కోసం నేను తొమ్మది నెలలు ఆగాలా? అని అనిపిస్తుంది. కాస్త త్వరగా పుడితే ఎంత బాగుంటుందో’ అని స్వాతి చెప్పినట్టే జరిగిందని ఫ్యాన్స్ గుర్తుచేసి గ్రీటింగ్స్ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా సంచలన, వివాదాస్పద నటి శ్రీరెడ్డి సైతం స్వాతి నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఫేస్‌బుక్ ద్వారా తన విషెస్‌ను తెలియజేశారు. అయితే, ఎప్పటిలానే శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుభాకాంక్షలు చెబుతూనే మెగాస్టార్ చిరంజీవిని మధ్యలోకి లాగారు. ‘అభినందనలు స్వాతి. ఏదేమైనా నువ్వు చిరంజీవి కుటుంబానికి చెందిన దానివి కాదు కదా. అందుకే, నీ పాప ఫొటోలు వైరల్ కాలేదు. ఆ దేవుడు నిన్ను దీవించాలి’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. కాగా, స్వాతినాయుడు, అవినాశ్‌లది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. తన బోయ్‌ఫ్రెండ్ అవినాష్‌తో చాలా కాలం సహజీవనం చేసిన స్వాతి.. 2019 ఫిబ్రవరి 23న విజయవాడలో పెళ్లి చేసుకున్నారు.