Romeo and Juliet movie actors who filed a case in court
mictv telugu

తమపై న్యూడ్‌సీన్స్ తీశారని కోర్టుకెక్కిన హీరోహీరోయిన్లు

January 4, 2023

సినిమాలో తమకు చెప్పకుండా న్యూడ్ సీన్స్ చిత్రీకరించారని ప్రముఖ హాలీవుడ్ చిత్రం రోమియో అండ్ జూలియట్ ప్రధాన పాత్రధారులు కోర్టు మెట్లెక్కారు. ఈ చిత్రం రిలీజై 55 ఏళ్లు కాగా, అప్పట్లో నాలుగు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. పారామౌంట్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో లియోనార్డ్ వైటింగ్, ఒలివియా హస్సీ ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో వీరి వయసు 16, 15 ఏళ్లు. ఈ సినిమాలో టీనేజీ పిల్లల నగ్న చిత్రాలను అమ్మారని, బెడ్రూం సీన్లలో తమ ప్రైవేట్ పార్ట్స్ చూపించారని తాజాగా దావా చేశారు. దీనిపై వీరిద్దరి బిజినెస్ మేనేజరుగా ఉన్న టోనీ మారినోజీ స్పందిస్తూ ‘స్టూడియో వారు చెప్పింది ఒకటి తీసింది ఒకటి. దర్శకుడిని నమ్మి 16 ఏళ్ల వయసులో చెప్పినట్టు చేశారు. ఆ వయసులో వారికి వేరే ఆప్షన్ లేదు. చెప్పినట్టు చేయడం తప్ప’ అంటూ వివరించాడు. కాగా, కాలిఫోర్నియా చట్టాల ప్రకారం పిల్లల లైంగిక వేధింపుల కేసు ఎన్ని ఏళ్ల తర్వాతైనా చెల్లుబాటు అవుతుంది.