కరోనా అప్డేట్.. కొత్తగా 3,688 కేసులు: కేంద్ర ఆరోగ్య శాఖ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా అప్డేట్.. కొత్తగా 3,688 కేసులు: కేంద్ర ఆరోగ్య శాఖ

April 30, 2022

దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొదట్లో రెండువేల లోపు నమోదు అయిన కేసులు మూడు వేలకు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,688 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు శనివారం వెల్లడించారు.

”కొత్తగా 3,688 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో ఒక్క ఢిల్లీలోనే 1,607 కేసులు ఢిల్లీలో నిర్ధారణ అయ్యాయి. 2,755 మంది కోలుకున్నారు. 50 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,30,75,864కి చేరుకుంది. ఇప్పటివరకు 4,25,33,377 మంది కోలుకోగా, 5,23,803 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 18,684 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,88,89,90,935 డోసుల కరోనా వ్యాక్సిన్ వేశాం. శుక్రవారం ఒక్కరోజే 22,58,059 మంది వ్యాక్సిన్ వేశాం” అని కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.

మరోపక్క జూన్ నాటికి కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ఇటీవలే అంచనా వేశారు.ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ, నిర్ణయాలు తీసుకున్నాయి. తెలంగాణలో కూడా మాస్క్ లేకపోతే రూ.1000 ఫైన్ విధిస్తామని హెల్త్ డైరెక్టర్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. కావున దేశ ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యలు సూచిస్తున్నారు.