ఆడవాళ్లు.... ఆడవాళ్లనే కామెంట్ చేస్తే ఎట్లా...... - MicTv.in - Telugu News
mictv telugu

ఆడవాళ్లు…. ఆడవాళ్లనే కామెంట్ చేస్తే ఎట్లా……

July 15, 2017

అక్కడికి వెళ్తే 15 రోజుల్లో అత్యాచారం తప్పదు…. ఈ మాట విన్నా … చదివినా.. అరే…. ఏందది అన్పిస్తుంది కదా ఎవ్వరికైనా. నిజంగానే అట్లా అవుతుందా.. కాదా అనేది వేరే విషయం. ఈ మాట అన్నది మాత్రం ఓ మహిళనే. మరింతలా ఎందుకన్నట్లు. పరిస్థితి తీవ్రతను చెప్పడానికి  అనుకోవచ్చు. ఎంత పరిస్థితి అయితే మాత్రం ఇంత తీవ్రమైన మాట అనొచ్చునా…అంటే ఆమెకు మాత్రం అంటే తప్పేంది అని అన్పొంచొచ్చు.

ముందుగా ఈ మాట అన్నవారి గురించి చూద్దాం. బిజెపి ఎంపి రూపా గంగూలి మేడం ఈ మాట అన్నారు. బెంగాల్ లో జరుగుతున్న  హింస అక్కడి పరిస్థితుల  గురించి చెప్తూ అక్కడికి అంటే బెంగాల్ కు వెళ్తే  మీ భార్యలు, ఆడ పిల్లలు అత్యారానికి గురి కాకుండా రాలేరని మీడియాతో  అన్నారు.  అంటే తృణమూల్ కాంగ్రెస్ ను, కాంగ్రెస్ ను సమర్ధిస్తున్న వారినుద్దేశించి ఈ మాటలు అన్నారు. పార్టీలు, మీరు మీరు ఏదైనా తేల్చుకోండి. ఎన్నైనా మాట్లాడుకోండి. కాకా పోతే  అక్కడి  పరిస్థితులను చెప్పాల్సిన ప్రతీ సారి మహిళనే  టార్గెట్ గాచేసుకుని చెప్తున్నారనేదే ఇక్కడ పెద్ద అభ్యంతరం.అయితే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా మహిళనే కదా.

పది రోజుల కింద ఓ సిన్మా స్టిల్ ను  పోస్టు చేశారు ఓ బిజెపి నాయకురాలు. ఇదీ బెంగాల్ పరిస్థితుల గురించి చెప్తూ ఆమె ఆవేదనను ఫోటో రూపంలో చెప్పారు. అక్కడా మహిళనే ఉదాహరణగా తీసుకున్నారు. మీకు మహిళలు తప్ప ఇంకెవరు ఎందుకు గుర్తుకు రావడం లేదు. మీ రాజకీయాల కోసం ఇండ్లల్లో ఉన్న నాయకుల భార్యలు, పిల్లలు, కోడళ్లను   రోడ్డు మీదకు  ఎందుకు తెస్తున్నారు.

తిట్టాల్సి వచ్చినా…. ఇంకేదైనా విమర్శ చేయాల్సి వచ్చినా మహిళనే  ఎంచుకుంటున్నారు పోల్చడానికి రూపా  మేడమ్ అయితే సిన్మా డైలాగులు, సిన్మాల్ల సీన్లు బాగా ఒంటబట్టించుకున్నట్లుంది. అంతా సిన్మాటిక్ గానే ఆలోచిస్తున్నట్లుంది. వాస్తవంలోకి వచ్చి మాట్లాడండి.  సంబంధం లేని వారిని దీంట్లోకి లాగడం దేనికి. ఇప్పటికే సిన్మాలు, టీవి సీరియళ్ల దెబ్బకు అత్తాకోడళ్లు, మనుష్యుల సంబంధాలు  ఎట్లా ఉన్నాయో చూస్తనే ఉన్నాం.అది చాలదన్నట్లు ఇంత దర్మార్గమైన పోలికలెందుకు.

భాష మీద, విషయం మీద పట్టు సాధించండి. మరో రూపంలో చెప్పండి. మరోలా చెప్పండి.  అయిందానికి, కాని దానికి ఆడవాళ్లనే లాగొద్దండి. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదండి. ఇప్పటికైనా కాస్త ఆలోచించి  పోస్టింగ్ లు పెట్టండి. కామెంట్లు చేయండి. మీడియాతో చెప్పండి.