రూట్ మార్చిన బంగారం.. ఎంతంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

రూట్ మార్చిన బంగారం.. ఎంతంటే..

May 5, 2022

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు రూట్ మార్చాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఒకసారి పెరుగుతూ, మరోసారి తగ్గుతూ, వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవలే ఏపీ, తెలంగాణలో అక్షయ తృతీయ అమ్మకాలు జోరుగా జరిగి, మార్కెట్ వర్గాల అంచనాలను అందుకున్నాయి. కొనుగోళ్లు పెరడంతో ధరలు కూడా జోరుందుకున్నాయి.

హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 నుంచి 400 పెరిగి, 47,400కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51,280 నుంచి 420 పెరిగి 51,700కి చేరింది. వెండి ధర కేజీకి 67,000 నుంచి రూ.700 పెరిగి 67,700కి చేరింది.

మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ, రూపాయి విలువను హరించేస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్ 129 డాలర్లకు చేరుకోవడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిళ్లకు దారితీసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాలంలో అత్యంత కనిష్ఠానికి చేరింది.