Roping girl sayla swings from a mountain, video goes viral
mictv telugu

పిల్ల కాదు, చిచ్చర పిడుగు.. వీడియో

November 10, 2022

Roping girl sayla swings from a mountain, video goes viral

కొందరు పిల్లలకు అసలు భయమనేదే ఉండదు. గిలకను పట్టుకున్నంత ఈజీగా పామును కూడా పట్టుకుని లటక్కున నోట్లో పెట్టేసుకుంటారు. అమెరికాకు చెంది ఈ మూడేళ్ల పిల్ల సైలాకి మరింత డేర్ డ్యాషింగ్. వందల అడుగుల ఎత్తులో బొత్తిగా భయమన్నదే లేకుండా వేలాడుతుంటుంది.

సైలీ రక్తంలోనే ఆ ధైర్యం ఉంది. ఆమె తల్లి జెనెల్, తండ్రి ఇక్ స్మైలీలు ప్రొఫెషనల్ మౌంటెనీర్లు. పర్వాతారోహణకు వెళ్లినప్పుడడల్లా కూతర్ని పోలోమని వెంటబెట్టుకుపోతుంటారు. సైలాకి తాడు కట్టి మాంచి ఎత్తులో ఆడిస్తుంటారు. తాజాలా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సైలాని తాడు కట్టి కొండ మీద నుంచి కిందికి తోసి ఊగించారు. కొండ అంచున నిలబడిన తండ్రి అంతా గమనిస్తుండగా తల్లి వీడియో తీసింది. సైలా పక్షిలా ఏమాత్రం భయం లేకుండా కాళ్లు చేతులు అల్లాడిస్తూ ఓ ట్రిప్ కొట్టొచ్చింది. చూడ్డానికి భలేగా ఉన్నా, ఇలాంటి విన్యాసాలు అందరూ చేయకూడదని, ప్రొఫెషనల్ వరకే ఇది పరిమితమని తల్లిదండ్రులు చెబుతున్నారు.