షారూక్ ఖాన్‌కు షాక్.. కేకేఆర్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ - MicTv.in - Telugu News
mictv telugu

షారూక్ ఖాన్‌కు షాక్.. కేకేఆర్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

February 4, 2020

gghfcv

బాలీవుడ్ హీరో షారూక్‌ ఖాన్‌కు ఈడీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన రూ. 70 కోట్ల విలువైన ఆస్తులు ఈడీ అటాచ్ చేసినట్టుగా ప్రకటించింది.రోజ్‌వ్యాలీ కుంభకోణంలో విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఆస్తులను అటాచ్ చేసిన లిస్ట్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పోర్ట్స్‌ లిమిటెడ్‌,సెయింట్‌ జేవియర్స్‌ కాలేజ్‌,రిసార్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 

అయితే రోజ్ వ్యాలీతో, కేకేఆర్ తీసుకున్న స్పాన్సర్‌షిప్‌ ఢీల్‌ సంబంధిత విషయంలో షారూక్‌కు గానీ, ఆయన భార్య గౌరీ ఖాన్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదని  చెబుతున్నారు. కాగా రోజ్ వ్యాలీ పేరుతో ఆ కంపెనీ చట్టవిరుద్ధంగా ప్రజలను మోసగించి డిపాజిట్లను సేకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఆస్తులను అటాచ్ చేశారు. ఈ కుంభకోణం 2013 లో వెలుగులోకి రావడంతో 2015 లో రోజ్ వ్యాలీ యజమాని గౌతమ్ కుండును ఈడీ అధికారులుఅరెస్టు చేసిన సంగతి తెలిసిందే.