భార్యను కాదని లాటరీ కొనుగోలు.. ఫలితం కోట్ల డబ్బు - MicTv.in - Telugu News
mictv telugu

భార్యను కాదని లాటరీ కొనుగోలు.. ఫలితం కోట్ల డబ్బు

April 23, 2022

లాటరీ టిక్కెట్లంటే ప్రతీ ఒక్కరికీ ఆశ ఉంటుంది. అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. తగిలితే ఒకేసారి కోట్ల డబ్బు వస్తుందన్న ఆశతో చాలా మంది లాటరీ టిక్కెట్ కొనుగోలుకు మొగ్గు చూపుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన మనదేశంలోనే పంజాబులో జరిగింది. వివరాలు.. భటిండా జిల్లాకు చెందిన రోషన్ అనే వ్యాపారికి లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. దాదాపు 30 ఏళ్ల నుంచి టిక్కెట్లను కొంటూనే ఉన్నాడు. కొన్ని సార్లు ఏదో వందో రెండొందలో తగిలేవి తప్ప చెప్పుకోదగ్గ అమౌంట్ రాలేదు. ఇన్నేళ్లుగా ఈ తతంగాన్ని గమనిస్తూ వచ్చిన అతని భార్య విసిగిపోయి ఇక నుంచి లాటరీ కొనడం మానేయమని ఒత్తిడి తెచ్చింది. వినకపోవడంతో కోపంతో ఊగిపోయింది.

అయినా మనోడు భార్యను కూడా కాదని లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఈ క్రమంలో పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖీ బంపర్ లాటరీలో మెగా ప్రైజ్ గెలుచుకున్నాడు. దీని విలువ రెండున్నర కోట్లు. ఈ విషయం తెలియగానే ఆనందంతో రాత్రంతా నిద్ర పట్టలేదని చెప్పాడు. పన్నులు పోను రూ. 1.75 కోట్లు వస్తాయని లెక్కలేసుకున్నాడు. వచ్చిన మొత్తాన్ని కుటుంబం, కొత్త వ్యాపారం కోసం ఖర్చు చేస్తానని తెలిపాడు. అయితే లాటరీ టిక్కెట్ వద్దన్న రోషన్ భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఫన్నీగా మీ అభిప్రాయాలను కామెంటులో రాయండి.